పవన్ కల్యాణ్ పై ఎంపీ కవిత సెటైర్లు

Wednesday, September 24th, 2014, 02:02:18 PM IST

kavitha-and-pavan
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ ఎంపీ కవిత మరోసారి సెటైర్లు విసిరారు. పవన్ కళ్యాణ్‌ను ఆమె మేకప్, ప్యాకప్ గయ్‌గా అభివర్ణించారు. పవన్ ఎప్పుడూ మేకప్, పేకప్ వ్యక్తన్నారు. ఎన్నికల ముందు కొద్ది మేకప్ తో వస్తారని, కొంచెం నటించి వెళ్లిపోతారన్నారు. కానీ, తామెప్పుడూ ప్రజలతోనే ఉంటామని, అలాగే కొనసాగుతామన్నారు.

హైదరాబాదులోని ఇంగ్లీష్ డైలీ ‘దక్కన్ క్రానికల్’ రిపోర్టింగ్, ఎడిటోరియల్ స్టాఫ్‌తో కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన మాటకారితనం తనకు వారసత్వంగా వచ్చింది కాదని, టాలెంట్ తో ఎన్నో ఏళ్లు కష్టపడి పొందిందని చెప్పారు. ఇదే సందర్భంలో తెలంగాణలో స్థానికత నిబంధనను సమర్థించిన ఎంపీ, తమ ప్రజలకు చాలా అవసరమన్నారు.

గత ఎన్నికల సమయంలోనూ పవన్ – కవిత.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న విషయం తెలిసిందే.