పేకాడుతూ దొరికిపోయిన హాస్యనటి

Monday, April 27th, 2015, 12:36:11 PM IST

kalyani
ఆదివారం రాత్రి ఓ ప్రముఖ నటి పేకాడుతూ పోలీసులకు దొరికిపోయింది. ఎల్బీనగర్ లోని చింతల్ కుంటలో పేకాట నడుస్తున్నట్లుగా గుర్తించిన పోలీసు అధికారులు ఆదివారం రాత్రి ఈ స్థావరంపై మెరుపు దాడి చేశారు. పోలీసులను చూసిన ఆ జూదగాళ్ళు జాదూగాళ్ళ వలె పారిపోయే ప్రయత్నం చేయగా వారిని చాలా తెలివిగా పట్టేసుకున్నట్లు సమాచారం.
పట్టుబడ్డవారిలో క్యారెక్టర్ నటి కళ్యాని (కరాటే కళ్యాని)తో పాటు 11మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా ఆ స్థావరంలో రూ. 75వేలు నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.