ప్రధాని మోడీ మాట.. మహిళలు ఆగ్రహంతో ఉన్నారు!

Monday, November 2nd, 2015, 08:40:48 PM IST

modi
బీహార్ ఎన్నికల నేపధ్యంలో నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన వాక్ చాతుర్యంతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మోడీ బీహార్ లోని పూర్ణియలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ.. గత పాలకుల తీరుపై బీహార్ లో మహిళలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.

మోడీ ఇంకా మాట్లాడుతూ.. బీహార్ ను లాలూ 15 సంవత్సరాలు, నితీష్ 10 సంవత్సరాలు పాలించారని.. వీరి జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అలాగే గత పాలకులు తమ అసమర్ధతపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందని మోడీ అన్నారు. అంతేకాకుండా తాను బీహార్ కు రావడాన్ని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయో తెలియడంలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని ప్రధాని మోడీ సూచించారు.