వివాదాలకు దారితీస్తోన్న జోగిని శ్యామల వ్యాఖ్యలు!

Monday, July 30th, 2018, 07:08:03 PM IST

ఎప్పుడు లేని విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై పలు రకాల విమర్శలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఏర్పాట్లు ఏ మాత్రం అనుకూలంగా లేవంటూ జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ విషయంపై స్పందించారు. జనాలు అధిక సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని అలాగే ప్రముఖంగా పవన్ కళ్యాణ్ లాంటి వీఐపీలు రావడం వలన సాధారణ భక్తులకు కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు.

ఇక్కడి పరిస్థితుల ప్రభావం గురించి కూడా తెలుసుకోవాలని చెబుతూ.. చల్లగా ఉండాలని కోరుకునే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తలసాని వివరణ ఇచ్చారు. ఇక ఈ వివాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు స్పందించారు. జోగిని శ్యామల పెట్టిన శాపం ప్రభుత్వానికి మంచిదికాదని గతంలో చాలా సార్లు జోగినులు చెప్పినవి నిజమయ్యాయని వివరణ ఇచ్చారు. అదే విధంగా బిసిలను తెలంగాణ ప్రభుత్వం తక్కువగా చూస్తోందని వారికి చాలా విషయాల్లో అన్యాయం జరుగుతోందని అన్నారు. ఇక వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడమే ముఖ్యమని చెబుతూ ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే విషయంలో తుది నిర్ణయం అదిష్టానానిదేనని విహెచ్ వివరణ ఇచ్చారు.