వెండితెరపైకి మరో సినీరాజకీయ నేత కుమారుడు!

Saturday, January 10th, 2015, 05:58:14 PM IST

jayasuda
మాజీ ఎమ్మెల్యే, సహజ నటి జయసుధ తనయుడు శ్రేయన్ కపూర్ త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ మేరకు ఆతను నటించే చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా జయసుధ చిన్న కుమారుడైన శ్రేయన్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించడంతో ఆ రంగం వైపు జయసుధ అతనిని ప్రోత్సహిస్తున్నారు. ఇక శ్రేయన్ నటించే ఈ సినిమాకు వాసు మంతెన దర్శకత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆయనే నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ప్రముఖ నటిగా అందరికీ సుపరిచితురాలైన జయసుధ 2009 అసెంబ్లీ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలో దిగి విజయం సాధించారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికలలో అదే స్థానం నుండి పోటీ చేసి జయసుధ ఓడిపోయిన సంగతి తెలిసిందే.