సచిన్ ఇంటికి గెస్ట్ గా వచ్చిన ‘ఇండియా’ తండ్రి..!

Tuesday, September 6th, 2016, 04:35:30 PM IST


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంటికి నిన్న వినాయక చవితి సందర్భంగా ఓ అతిధి వచ్చాడు.వినాయకుడి పూజ చేస్తున్న ఆ అతిధి ఫోటోను సచిన్ ట్విటర్ లో పోస్ట్ చేసి ఈ అతిథి ఎవరో చెప్పుకోండి అని అభిమానులకు కొంటె ప్రశ్న వేశాడు.దీనితో ఆలోచన లో తలమునకలైన అభిమానులు రికి పాంటింగ్ అని, రోజర్ ఫెదరర్ అని సమాధానాలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీనితో అభిమానులను విసిగించడం ఇష్టం లేక ఆ అతిధి ఎవరో సచిన్ చెప్పేశాడు. అతనెవరో కాదు..భారతీయ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడే సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ .జాంటీ రోడ్స్ కి భారతీయ సాంప్రదాయాలంటే ఎనలేని గౌరవం.

జాంటీ రోడ్స్ తన కూతురికి కూడా ఇండియా అని పేరుపెట్టారు. తన ఇంటికి జాంటీ రోడ్స్ గణపతి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడని సచిన్ తెలిపాడు.నిన్న వినాయక చవితి సందర్భంగా జాంటీ రోడ్స్ తో పాటు యువరాజ్ సింగ్ కూడా సచిన్ ఇంటికి అతిధిగా వెళ్లాడు.సచిన్ వీరికి తన ఆతిధ్యాన్ని అందించాడు.