జైల్లోకి జగన్..బాబు వ్యాఖ్యల్లో మర్మం ఏంటి..?

Saturday, February 18th, 2017, 03:55:04 AM IST


ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్..శశికళ లాగా భయంకర జైలు జీవితం అనుభవించక తప్పదా ? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ చర్చే హాట్ హాట్ గా జరుగుతోంది. కేవలం రూ 66 కోట్ల అక్రమాస్తుల కేసుల విషయంలో శశికళకు నాలుగేళ్ల పాటు జైలు శిక్షని సుప్రీం కోర్టుకి విధించింది. బెంగుళూరు కోర్టు శశికళ, జయలలితలు నిర్దోషులుగా తీర్పునిచ్చింది. కానీ సుప్రీం నుంచి మాత్రం శశికళ తప్పించుకోలేకపోయింది. అవినీతి పరుల వెన్నులో వణుకు పుట్టేలా సుప్రీం కోర్టు శశికళ విషయంలో సరైన నిర్ణయం తీసుకుందే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెని ప్రత్యేక ఖైదీగా గుర్తించేందుకు కూడా చట్టం అంగీకరించలేదు.

వైఎస్ జగన్ కూడా ఇదే గతి తప్పదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లక తప్పదంటూ కుప్పం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాదాపు 40 వేల కోట్ల మేర జగన్ అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ చార్జి షీట్లు దాఖలు చేసింది. క్రమక్రమంగా అతడి ఆస్తులను జప్తు చేస్తోంది. అతడి కేసు విషయంలో కోర్టు శశికళ కేసులోకంటే కఠినమైన తీర్పుని వెలువరుస్తుందని అంటున్నారు. శశికళ కేసు తీవ్రత కంటే జగన్ కేసు తీవ్రత ఎక్కువని, ఆలస్యమైనా జగన్ శిక్ష అనుభవించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను నిర్దోషి అని నిరూపించుకోకుంటే చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కేసులో విచారణ వేగవంతం అయ్యేలా ప్రభుత్వం తరుపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఒత్తిడి చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.