పాకిస్తాన్‌లో మ‌న అభినంద‌న్.. జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్..!

Thursday, February 28th, 2019, 09:33:52 AM IST

భార‌త్ భూభాగంలోకి ప్ర‌వేశించిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెనక్కి తిప్పికొడుతున్న సమయంలో భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ పాక్ ఆర్మీకి చిక్కిన సంగ‌తి తెలిసిందే.

బుధ‌వారం ఉదయం పాకిస్తాన్ జెట్ ఫైటర్లు భారత గగనతలంలోకి వచ్చి దాడికి ప్రయత్నించ‌గా.. వాటిని గుర్తించిన‌ భారత బలగాలు వెంటనే తప్పికొట్టాయి.

అయితే ఈ క్ర‌మంలో మ‌న దేశానికి చెందిన ఓ మిగ్ 21 ఫైటర్ కూలిపోయింది. అందులో ఉన్న పైలెట్ అభినంద‌న్ ప్ర‌మాద‌వ‌శాత్తు పాక్ భూభాగంలోకి దిగ‌గా.. పాక్ ఆర్మీకి చిక్కారు.

ఈ క్ర‌మంలో అభినంద‌న్ కోసం యావ‌త్ భార‌త్ మొత్తం ఆందోళ‌ణ వ్య‌క్తం చేస్తుంది. అయితే తాజాగా అభినంద‌న్ మాట్లాడిన ఒక వీడియోను పాకిస్తాన్ విడుద‌ల చేసింది.

ఆ వీడియోలో అభినంద‌న్ మాట్లాడుతూ.. తాను క్షేమంగా ఉన్నాన‌ని, పాక్ ఆర్మీ త‌న‌ను బాగానే చూసుకుంటుంద‌ని తెలిపారు.

ఇక తాజాగా విక్ర‌మ్ అభినంద‌న్‌ను ఉద్దేశించి వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. అభినంద‌న్ క్షేమంగా రావాల‌ని, ఈ క‌ష్ట‌కాలంలో అత‌ని కుటుంబానికి మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని, అందుకోసం తాను భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్నానంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.