చంద్రబాబుకు జగన్ సవాల్!

Monday, March 9th, 2015, 03:42:42 PM IST

jagan-babu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి చాలెంజ్ విసిరారు. జగన్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొంటున్న చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అలాగే బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని భావిస్తే కేంద్ర సర్కారు నుండి బయటకు రావాలని చంద్రబాబుకు జగన్ సవాల్ చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మైకులు కట్ అవుతాయని, ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకశం కూడా ఇవ్వడంలేదని, ఇటువంటి వివక్ష ఎక్కడా లేదని మండిపడ్డారు. అలాగే టిడిపి నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని, చంద్రబాబుతో పాటు వారు అన్నీ నేర్చుకున్నారని జగన్ విమర్శించారు. ఇక సింగపూర్, జపాన్, అమెరికా ఎలాగైనా రాజధానిని కట్టుకోండని, కానీ రైతుల వద్ద నుండి భూములు లాక్కోవడం సరికాదని జగన్ హితవు పలికారు.