2019 ఎన్నిక‌లే టార్గెట్.. జగన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Friday, March 1st, 2019, 10:05:43 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో రానున్న ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇంచార్జ్‌లు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం అయ్యారు.

ఎన్నిక‌ల నేప‌ధ్యంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రిస్థితి క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా వారి నుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డ గ‌మానార్హం.

కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువ‌డునున్న సంగ‌తి తెలిసిందే. దీంతో నోటిఫికేష‌న్ రాగానే బ‌స్సుయాత్ర ప్రారంభిస్తాన‌ని జ‌గ‌న్ తెలిపారు.

అందులో భాగంగా వైసీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాన్ని కాపీ కొడుతున్న చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు.

దీంతో వైసీపీ నేత‌లు,కార్య‌క‌ర్త‌లు టీడీపీ చేస్తున్న మోసాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల‌ని, ఈ క్ర‌మంలో అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కొత్త ప‌రిశీల‌కుల‌ను జ‌గ‌న్ నియ‌మించారు.

అలాగే ప్ర‌తి రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్ల‌కు ఒక ప‌రిశీల‌కుని నియ‌మించారు జ‌గ‌న్. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు నిత్యం ప్ర‌జా క్షేత్రంలోనే ఉండాని ఈ స‌మావేశంలో భాగంగా జ‌గ‌న్ తేల్చి చెప్పారు.