ఆవు మాంసం తినోద్దన్నందుకు చంపేస్తారట..!

Tuesday, January 19th, 2016, 05:55:22 PM IST

modi-parikar
భారాత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను చంపేస్తామంటూ ఓ లేఖ గోవా పోలీసులకు అందింది. గతవారమే ఈ లేఖ అందినప్పటికీ వారు దీన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ ఈ విషయం బయటకు పొక్కడంతో చేసేది లేక వివరాలను వెల్లడించారు. ఈ లేఖను గోవా పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు అప్పగించారు.

లేఖ చివర ఐఎస్ఎస్ అని సంతకం చేసుండటంతో అది ఐసిస్ లేఖేనని కన్ఫర్మ్ చేసిన అధికారులు దాని ఆధారంగా దర్యాప్తు చేస్తునారు. ఈ లేఖలో ముఖ్యంగా భారతదేశంలో గోమాంస నిషేధం విధించినందుకు గాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సారాంశం ఉంది. దీంతో దేశంలోని 13 రాష్ట్రాల భద్రతా బలగాలతో రాజ్ నాథ్ సింగ్ శనివారం మీటింగ్ ఏర్పాటు చేసి చర్చలు కూడా జరిపారు.