తెలుగుదేశం-కాంగ్రెస్ కలిసిపోతున్నారా..?

Saturday, September 8th, 2018, 02:40:54 PM IST

తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి రోజు ఆధ్యంతం ఉత్కంఠ నెలకొంటుంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలుపుతున్నారు అనే మాట చాలా బలంగా వినపడుతుంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది అంది అని పలు మార్లు ప్రస్తావించారు. అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా? లేదా అన్న దాని మీద ఒక వివరణ ఈ రోజు ఇస్తారు అన్నట్టు తెలుస్తున్నది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులు సీట్ల కేటాయింపుల మీద తెలంగాణా లోని తెలుగుదేశం నాయకులతో చర్చించడం కోసం, చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. లేక్ వ్యూ అతిధి గృహం లో వారి నాయకులతో భేటీ అయ్యినట్టు తెలుస్తున్నది. ఈ భేటీ లో అటు కేంద్ర ప్రభుత్వం లో బీజేపీ ని ఇటు తెలంగాణలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సంబందించిన చర్చలు జరగనున్నట్టు, అంతే కాకుండా ఈ భేటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ తో కానీ సిపిఐ తో కానీ పొత్తుల విషయం మీద ఒక కొలిక్కి రావచ్చని తెలుస్తుంది అని ఈ రోజు చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ తో పొత్తు విషయం పై ఒక క్లారిటీ ఇవ్వనున్నారు అని తెలుస్తుంది.