హాలీవుడ్ లోనూ అసహనం..?

Saturday, January 30th, 2016, 04:50:06 PM IST


హాలీవుడ్ లో అసహనం మొదలైంది. ప్రపంచంలోనే ప్రఖ్యాత పురష్కారమైన అకాడెమీ అవార్డులకు ఎక్కువగా తెల్లజాతీయులకు వస్తుండటంతో.. నల్లజాతీయులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అకాడెమి అవార్డులలో తమకు అన్యాయం జరుగుతుందని అంటూ వారు వాపోతున్నారు. అకాడెమి అవార్డుల కోసం వివిధ కేటగిరిలలో మొత్తం 20 మందిని ఎంపిక చేస్తారు. ఆ 20 మందిలోనుంచి ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు ఇలా ఎంపిక చేస్తారు. అయితే, ఇలా ఎంపిక చేస్తున్న 20 మందిలో కూడా ఎక్కువగా తెల్లవాళ్ళే ఉన్నారు. పైగా గతేడాది అకాడెమీ అవార్డులు అన్ని కూడా తెల్లవాళ్ళకే వెళ్ళాయి.

దీంతో ఈ సంవత్సరం జరిగే అకాడెమి అవార్డులకు వెళ్ళకూడదని కొంతమంది నటులు నిర్ణయించుకున్నారు. వీరిలో వీల్ స్మిత్, ఆయన భార్య జాడా పింకెట్ స్మిత్ లు కూడా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారట. ఎందుకు అంటే.. ఈ సంవత్సరం కూడా అకాడెమి అవార్డులకు పంపిన 20మంది శ్వేతజాతీయులే కావడం ఈ అసహనానికి కారణం అని తెలుస్తున్నది. ఇదిలా ఉంటె, ఆస్కార్ అవార్డులు ఇచ్చే మోషన్ అకాడెమికి ఈ సంవత్సరం ఆఫ్రికన్ మహిళ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే, ఇందులో తన తప్పేమీ లేదని.. ఆయా క్యాటగిరిలో అర్హులు ఎవరు అని నిర్ణయిస్తారని చెప్తున్నది. ఇక్కడ మరో విషయం కూడా తెరపైకి వస్తున్నట్టు తెలుస్తున్నది. తెల్లవాళ్ళకు ఆస్కార్ అవార్డులు ఇస్తుండటంతో.. నల్లజాతీయులు కూడా ఆస్కార్ తరహాలో ప్రత్యేకంగా అవార్డులు పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.