ఇంటర్నెట్ హల్ చల్ : పవన్ తాతకు ప్రేమతో.. ముద్దు తెచ్చిన తంటా..!

Sunday, April 17th, 2016, 12:11:36 AM IST

పవన్ తాతకు ప్రేమతో ..: పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబార్ సింగ్ సినిమా సంగతి ఎలా ఉన్నా.. ఆ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం అందరికీ విపరీతంగా నచ్చింది. పవన్ స్టైల్ కు.. పవన్ క్రేజీకి తగ్గట్టుగా సాంగ్ ఉంటుంది. ఇక లిరిక్స్ పరంగా కూడా సాంగ్ హైలైట్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న పదాలతో ప్రయోగం చేశారు. అయితే, ఈ సాంగ్ పెద్దవాళ్ళ దగ్గరి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ నచ్చింది. ఈ సాంగ్ అల్లు అర్జున్ రెండేళ్ళ కొడుకు అల్లు ఆయన్ కు కూడా విపరీతంగా నచ్చిందట. అవును పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను అల్లు ఆయన్ తన తండ్రి ఐ ఫోన్ పవన్ తాత సాంగ్ వింటున్నాడని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది.

దొంగలు దోచేసినా.. వాళ్ళు ముద్దు వదలలేదట..: ఎంత ఘాటుగా ముద్దు పెట్టుకున్నప్పటికీ.. పక్కన ఏం జరుగుతుందో అని కూడా తెలుసుకోకుండా పెట్టుకుంటారా చెప్పండి. పోనీ ఏదో అలికిడి జరిగిందిలే పట్టించుకోవద్దు అనుకుంటే సరే.. కాని, ఇక్కడ జరిగింది అది కాదు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓ రెస్టారెంట్ లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారు. దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే, పోలీసులు సీసీటీవీ పూటేజ్ ను పరిశీలించారు. దొంగలు పడింది నిజమే. దోచుకుపోయింది కూడా నిజమే అట. అయితే, అలా రెస్టారెంట్ లో దొంగలు పడిన సమయంలో ఓ జంట ఘాటుగా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నది. ఆ సమయంలో వారు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారట. అసలు దొంగలు పడిన సంగతి కూడా వాళ్లకి తెలియదని పోలీసులకు చెప్పడం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి: