అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం

Sunday, December 28th, 2014, 10:50:38 AM IST


మలేషియా కు చెందిన ఎం 370 విమానం విషాదం నుంచి ఇంకా తేరుకోక ముందే ఇండోనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం మిస్ అయింది. ఇండోనేషియాలోని సురబాయి నుంచి సింగపూర్ కు బయలుదేరిన క్యూజెడ్ 8501 విమానం బయలు దేరిన కొద్ది సేపటికే కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానంలో మొత్తం 160 ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో 155 మంది ప్రయాణికులలో, 149మంది ఇండొనేషియన్లు కాగా, మిగిలిన వారు మిగతాదేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే, ఈ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సింగపూర్ చేరుకోవలసి ఉండగా, ఏడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో కంట్రోల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. కాగ, అదృశ్యమైన విమానం కోసం అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.