చేయి చేయి పట్టుకుని మృత్యువు ఒడిలోకి…

Wednesday, December 31st, 2014, 11:05:27 AM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో కొందరి మృతదేహాలు బోర్నియా తీరంలో లభ్యమయ్యాయి. అయితే విమానంలో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో కలిపి మొత్తం 162మంది ప్రయాణించగా ప్రస్తుతానికి 50లోపు మృతదేహాలు మాత్రమే లభించాయి.

ఇక బోర్నియా సమీపంలో మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీం కు హృదయ విదారకమైన దృశ్యాలు కనిపించాయి. కాగా విమాన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని విగత జీవులుగా నీటిపై తేలుతూ కనిపించారు. ఇక ప్రమాదంలో ప్రాణాలను రక్షించుకునే నేపధ్యంలో వీరు చేతులు పట్టుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు. కాగా ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు కొన్నే లభించగా ఇంకా వందకు పైగా మృతదేహాలు లభించాల్సి ఉంది.