ఆసియా క్రీడల్లో భారత్ కు స్వర్ణం!

Tuesday, August 28th, 2018, 11:23:00 AM IST

ఆసియ క్రీడలు మొదలయినప్పటినుండి మంచి ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే ఈ క్రీడల్లో నేడు స్వర్ణం కోసం బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో నేడు ఫైనల్ లో పివి సింధు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. కాగా నిన్న భారత్ కు పసిడిని అందించాడు జావెలిన్ త్రో ఆటగాడునీరజ్ చోప్రా. ఇదివరకు తనపేరిట వున్న 88.06 మీటర్ల జాతీయ రికార్డును తానే అధికమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కాగా ఆసియా క్రీడల్లో పథకం సాదించిన రెండవ భారతీయ క్రీడాకారుడుగా నీరజ్ నిలిచాడు. అయితే 1982లో గురు తేజ్ సింగ్ ఇదివరకు ఢిల్లీ క్రీడల్లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. మొదటినుండి మంచి ఆత్మవిశ్వాసంతో ఆట మొదలెట్టిన నీరజ్ తొలుత 83.46 మీటర్లతో ఆటను ఆరంభించి, ఆ తరువాత కాస్త తడపడి ఒక ఫౌల్ వేసాడు.

ఇక చివరిగా మూడవసారి గట్టిగా ప్రయత్నం చేసిన అతడు 88.06 మీటర్ల దూరం విసిరి ఇదివరకు తనపేరిట వున్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. కాగా అతడు చేసిన ఆ మూడవ ప్రయత్నమే అతడి కెరీర్లో బెస్ట్ గా నిలిచి భరత్ కు స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టింది. ఇక తరువాత స్థానాల్లో చైనాకు చెందిన లియు కిజెన్ (82.22) మీటర్లతో రజతం, అర్షద్ నదీమ్ (80.75) మీటర్లతో కాంస్యపతకం చేజిక్కించుకోగా మరొక భారతీయ ఆటగాడు శివ పాల్ సింగ్ (74.11) మీటర్ల దూరం విసిరి ఎనిమిదవ స్థానంలో నిలిచాడు….