బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని గాడిదను చేశారుగా..!

Monday, May 9th, 2016, 03:30:15 PM IST


బీజేపీ కార్యకర్తల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. శాంతికి చిహ్నంగా చెప్పుకునే హిందూత్వాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని నడిచే బీజేపీ చేసిన ఈ ఘాతుకం హిందూత్వానికే మచ్చ తెచ్చేదిగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకుంటున్న వేళ ఘోరఖ్ పూర్ లోని బీజేపీ మైనారిటీ సభ్యులు తమ నేత ఎంపీ ఆదిత్య నాథ్ ను మద్దత్తుగా కొన్ని పోస్టర్లను తయారుచేసి అంటించాయి.

అందులో ఆదిత్య నాథ్ పులిలా ఉండగా రాహుల్ గాంధీ, మాయావతి,అఖిలేష్ యాదవ్, అక్బరుదీన్ ఒవైసీ లను గాడిదలుగా చిత్రీకరించి చూపారు. దీంతో ఇది దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. తమ నేతపై ఎంతటి అభిమానం ఉన్నా ఈ చర్య మాత్రం సమర్థనీయం కాదని పలు రాజకీయ పార్టీల నేతలు దీన్ని ఖండిస్తున్నారు. కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ఇది బీజేపీ అధికార అహంకారానికి ఓ నిదర్శనం అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ బీజేపీ అగ్రనేతలెవరూ ఈ వివాదంపై ఇప్పటివరకూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.