దేశ నగరాలలో హైదరాబాదే బెస్ట్!

Thursday, March 5th, 2015, 09:47:25 AM IST


విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు ప్రపంచ సర్వే సంస్థ ‘మెర్సర్’ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. ఇక భారత దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, చెన్నైల కంటే హైదరాబాదే ఉత్తమ జీవన ప్రమాణాలకు కేంద్రంగా ఉందని సదరు సంస్థ ప్రశంశలు కురిపించింది.

అలాగే హైదరాబద్ లో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న విద్యాసంస్థలతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నగరానికి గొప్ప వరమని ఈ సంస్థ పేర్కొంది. ఇక ప్రపంచ నగరాల జాబితాలో 138వ స్థానంలో ఉన్న హైదరాబాద్ దేశంలోని మిగిలిన నగరాల కంటే ఉత్తమ జీవన ప్రమాణాలను కలిగి ఉందని ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.