హిట్టా లేక ఫట్టా : మెహబూబా – ప్రయత్నం బెడిసికొట్టిందబ్బా!

Friday, May 11th, 2018, 05:10:26 PM IST

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గత కొద్దికాలంగా హిట్లు లేక సతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ ను హీరోగా పెట్టి మెహబూబా అనే చిత్రాన్ని తానే దర్శకత్వం వహిస్తూ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. మొదట విడుదలయిన ఈ చిత్ర టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన పూరి ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఆ హైప్ ని మరింత పెంచారు. కాగా మంచి అంచనాల మధ్య నేడు విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి నెగటివ్ స్పందన వస్తోంది. దేశం మీద ప్రేమతో ఆర్మీలో చేరాలనుకున్న రోషన్ తన ఒకసారి హిమాలయాల్లో ట్రెకింగ్ చేస్తుండగా తన గత జన్మ ప్రేయసి అఫ్రీన్ గా జన్మించి, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉందని తెలుసుకుంటాడు.

అలా ఆమె కోసం పాకిస్థాన్ వెళ్లిన రోషన్ గత జన్మలో కోల్పోయిన ప్రేమను ఈ జన్మలో ఎలా దక్కించుకున్నాడు అనేది చిత్రం కథాంశం. మనం చెప్పుకున్న గత జన్మలో ప్రేమను కోల్పోయిన హీరో ఈ జన్మలో దక్కించుకోవటానికి చేసే ప్రయత్నామ్ అనే పాయింట్ సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఇంటర్వెల్ సమయంలో గత జన్మలో పూర్వజన్మలో ప్రేమ గురించి తెలుసుకునే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఆ పాయింట్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక పూరి తనయుడు ఆకాష్ నటనకు మంచి మార్కులే పడతాయి. క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకాష్ మంచి సహజ నటనను కనపరిచి అందరి మనసు గెలుచుకున్నాడు. ఇక ఫస్ట్ హాఫ్ లో పూరి తన మార్క్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి రాసుకున్న డైలాగులు, సీన్లు బాగున్నాయి. హీరోయిన్ నేహశెట్టి నటన బాగుంది. ఆకాష్ తండ్రిగా షాయాజీ షిండే నటన అక్కడక్క మనల్ని గిలిగింతలు పెడుతుంది.

అయితే పూరి రాసుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని స్క్రీన్ పై చూపించే విధానం పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే హీరోయిజం స్కీన్లు, ఇంటర్వెల్ సీన్ మినహా మిగిలిన కథ చాలా వరకు బోర్ కొడుతుంది. హీరో హీరోయిన్ల గతజన్మ ప్రేమ గురించి చూపించిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా సెకండ్ హాఫ్ మరీ సాగతీసినట్లు అనిపిస్తుంది. రెండు జన్మల ప్రేమ అనే కాన్సెప్ట్ దర్శకుడు తీసుకున్నపుడు హీరో, హీరోయిన్ల మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుంటుంది. కానీ ఈ చిత్రంలో అలాంటివి లేకపోవడం పెద్ద మైనస్. నిజానికి పూరి ఇటువంటి కొత్త ప్రేమకథలను తీసే బదులు ఆయన మార్క్ పాతకథతో తనస్టయిల్లో తీసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటె, అందులో కాస్త ఎంటర్టైన్మెంట్, ఫన్ అయినా దొరికివుండేవి. ఇక ప్రీ క్లైమాక్స్ లో హీరో ప్రేమను దక్కించుకోవడం కోసం పాకిస్థాన్ వెళ్లి చేసే ప్రయత్నాలు బలహీనంగా ఉంటాయి. ఇక చివరిగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే క్లైమాక్స్ సన్నివేశం అయితే ఇది ఖచ్చితంగా పూరి మార్క్ సినిమా కాదనిపిస్తుంది.

సందీప్ చౌతా అందించిన పాటలు పర్వాలేదనిపించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. ఇక విష్ణు శర్మ ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమాకు మంచి ప్లస్ అని చెప్పాలి. ఇకపోతే జునయీద్ సిద్దిఖి ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్ పై మరింత శ్రద్ధ పెంచితే బాగుండేది అనిపిస్తుంది. ఓవర్ అల్ గా చూస్తే పూరి కొత్తగా గత జన్మలో కోల్పోయిన ప్రేమను ఈ జన్మలో దక్కించుకోవడం అనేది కాన్సెప్ట్ వరకు బాగున్నా, ఆయన తెరకెక్కించిన విధానం ఆకట్టుకోక ప్రేక్షకుడిని మెప్పించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ఆకాష్ పూరి నటన, ఫస్ట్ హాఫ్, పూరి మార్క్ డైలాగ్స్, ఫస్ట్ హాఫ్ లో పూరి మార్ హీరోయిజం తప్ప చిత్రంలో ఇంకేమి ఉండదు. చివరిగా పూరి తన గత చిత్రాల్లా ఈ చిత్రంకూడా తీసివుంటే కొంతమేరకు ఆయనమార్క్ ఎంటర్టైన్మెంట్, ట్రీట్మెంట్ వంటివి ప్రేక్షకుడికి దొరికేవేమో……..

మెహబూబా మెప్పించలేకపోయింది

Reviewed By 123telugu.com |Rating :3.5/5

మెహబూబా ఒక బాధాకరమైన పూరి షో

Reviewed By andhraheadlines |Rating :1.5/5

పూర్ పూరి షో

Reviewed By gulte.com |Rating :2.5/5

పర్వాలేదనిపించిన పూరి

Reviewed By chitramala.in |Rating : 2.5/5