ఐశ్వర్యకు భారీ రక్షణ..?

Monday, February 16th, 2015, 07:17:51 PM IST


ఐశ్వర్య రాయ్ బచ్చన్… దాదాపు ఐదు సంవత్సరాల తరువాత మరల సినిమాలో నటిస్తున్నది. ఇక, ఐదు సంవత్సరాల తరువాత నటిస్తున్నా.. ఐష్ కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆమె నటించే తాజా సినిమా కోసం ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఐష్ షూటింగ్ లో పాల్గొనేందుకు ఇంటి దగ్గర బయలు దేరినప్పటినుంచి తిరిగి ఇంటికి వెళ్ళేవరకు ఈ సెక్యూరిటీ ఆమెను కనిపెట్టుకొని ఉంటుంది. ఈసెక్యూరిటీ కోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఈ తతంగమంతా ఐష్ నటించే కొత్త సినిమా జబ్బా కోసం ఏర్పాటు చేసిందే. ఐష్ కున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఈఏర్పాట్లు చేస్తున్నారు.