కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ కు విజ్ఞప్తి!

Tuesday, January 6th, 2015, 01:23:05 PM IST


కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజుతో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం హరీష్ రావు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే త్వరలో తెలంగాణ ముఖ్యమత్రి కెసిఆర్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుల అత్యున్నత స్థాయి సమావేశం ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల వివాదాలను కేంద్రమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అలాగే నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ సమావేశానికి హాజరుకానున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు. ఇక కల్వకుర్తి, కొమురం భీమ్, ప్రాణహితకు పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్రమంత్రి జవదేకర్ ను కలిసి కోరానని హరీష్ రావు వివరించారు.