లేడి ఎమ్మెల్యే తొడగొట్టింది..!!

Friday, December 11th, 2015, 02:42:18 PM IST

la
విశాఖ మన్యంలోని పాడేరు వైకాపా ఎమ్మెల్యే ఈశ్వరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడింది. మన్యంలో బాక్సైట్ గనులను తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే..ఊరుకునేది లేదని.. అన్నది. ఇక, అంతటితో ఆగకుండా.. బాబుపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగింది. బాబు దగాకోరని, వెన్నుపోటుపొడవడంలో బాబును మించిన వ్యక్తులు లేరని.. బాబు నరరూప రాక్షసుడంటు విమర్శలు చేసింది. బాక్సైట్ గనుల తవ్వకాలకు అనుమతి ఇస్తే.. గిరిజన తెగ సాంప్రదాయం ప్రకారం చంద్రబాబు తల తెగ గొడతామని సవాల్ విసిరింది. పాడేరు నియోజక వర్గంలో అభ్యర్ధిని నిలబెడితే.. తాను రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని.. తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, ఒకవేళ తాను గెలిస్తే.. బాబు తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించింది.

అయితే, ఇప్పుడు ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసిన తప్పులేదు కాని, వ్యక్తిగత విమర్శలకు దిగటం ఏమిటని అంటున్నారు. విమర్శలు చెయ్యొచ్చు కాని, మరీ ఇంతదారుణమైన విమర్శలు ఎందుకు చేసిందనేదే ఇప్పుడు తేలాలి. ఉత్తరాంధ్రాలో వైకాపా బలహీనంగా ఉన్నది. ఉత్తరాంధ్రాలో బలపదేందుకే ఈశ్వరి ఈ విధమైన విమర్శలు చేసిందని కొందరు అంటున్నారు.