సీమాంధ్ర కాంగ్రెస్ లో దుమారం

Saturday, November 30th, 2013, 11:29:39 AM IST

seemandhra

పార్టీ వ్యతిరేకులపై చర్యలు తప్పవన్న పీసీసీ చీఫ్ బొత్స హెచ్చరికలు సీమాంధ్ర కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. బొత్స వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక వర్గం.. సమర్థిస్తు మరో వర్గం తెరపైకి వస్తున్నారు. ఈ పోరులో ఎలాంటీ పరిమాణాలు చోటుకుంటాయోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది..

సీమాంధ్ర కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయానికి తెరలేచింది. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీపై అధిపత్యం కోసం సీఎం, పీసీసీ చీఫ్ బొత్స వర్గాలు పావులు కదుపుతున్నాయి..సమైక్యవాదం ముసుగులో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలపై చర్యలు తప్పవన్న బోత్స సత్యనారయణ హెచ్చరికలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బొత్స్ హెచ్చరికలపై ప్రత్యర్థి వర్గం ఘాటుగా స్పందిస్తోంది.

సస్పెన్షన్ అంటూ ప్రారంభిస్తే పార్టీలో ఎవరు మిగలరంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే బొత్సపై ఎదురుదాటికి దిగారు..రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తీర్మానం చేయడంలో బోత్స కూడ సంతకాలు చేశారంటూ ఆయన మండిపడ్డారు.. సీమాంధ్రకు చెందిన మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప రెడ్డి కూడా బొత్స హెచ్చరికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలనుకున్ నేతలు తమ స్వరాన్ని పెంచుతున్నట్టుగా ప్రత్యర్థి వర్గం భావిస్తుంది. ఇతర పార్టీల్లో సీట్లు పోందినవారు త్వరలోనే పార్టీకి గుడ్ బై చెపుతారని గాంధీ భవన్ లో ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు బోత్స వ్యాఖ్యలను ఆయన వర్గం నేతలు పార్టీలో ఉండాలనుకునే వారు సమర్థిస్తున్నారు..పార్టీకి నష్టం కల్గించేవారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న పీసీసీ చీఫ్ బొత్స హెచ్చరికలను మంత్రులు బాలరాజు,కొండ్రు మురళి, ఆనం రాంనారాయణ రెడ్డి సమర్ధిస్తున్నారు.

మొత్తం మీద బోత్స వ్యాఖ్యలతో సిఎమ్ కిరణ్ బోత్సల మధ్య మరోసారి కోల్డ్ వార్ కు తెరలేసినట్టయింది..గత కొద్ది రోజులుగా బోత్సపై కిరణ్ పై చేయి సాధిస్తు వస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణ పేరుతో పార్టీ వ్యతిరేకులకు చెక్ పెట్టేందుకు బోత్స సిద్దమవుతుండడం పార్టీలో మరింత గందరగోళానికి తావిస్తోంది.