రక్తసిక్తమైన ఈజిప్టు..200 మందిని ఎంత దారుణంగా చంపారంటే..!

Friday, November 24th, 2017, 09:57:57 PM IST

ఈజిప్టులో ఉగ్రవాదులు అతి దారుణమైన మారణకాండ సృష్టించారు. ప్రపంచమే భీతిల్లేలా 200 మంది ప్రాణాలను అతి కిరాతకంగా తీశారు. సినాయ్ లోని ఓ మసీదులో ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తుండగా మొదట బాంబు దాడి చేశారు. భయంతో బయటకు పరుగులు తీసిన జనంపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణహోమంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 150 మంది వరకు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని 30 అత్యవసర అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కూడా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడం దారుణమైన విషయం.

భయంకరమైన ఉగ్ర దాడి జరగడంతో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతని సమీక్షించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు మసీదుని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈజిప్టు ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలని ప్రకటించింది.