బీజేపీలో చేరిన ‘ద్రౌపతి’

Wednesday, January 7th, 2015, 06:25:20 PM IST

Rupa-Ganguly
కోల్ కత్తా హౌరాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ప్రముఖ నటి రూపా గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ నేపధ్యంగా ఆమెకు భాజపా జెండాను అందించి అరుణ్ జైట్లీ సాదరంగా ఆహ్వానం పలికారు. కాగా ప్రైవేట్ చానెళ్ళ హవా లేని కాలంలో రూపా గంగూలీ దూరదర్శన్ లో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ ‘మహాభారత్’ లో ద్రౌపతిగా నటించారు.

ఇక ఆ పాత్రకు విశేష ఆదరణ లభించడంతో అటుపై రూపా సినిమాల్లో బిజీ అయ్యారు. అలాగే తెలుగులో కూడా కొన్ని చిత్రాలు నటించిన ఈ బెంగాలీ నటి కమర్షియల్ చిత్రాలలోనే కాక ఆర్ట్ సినిమాలలో కూడా నటించారు. అయితే నటిగా పేరు పొందిన రూపా గంగూలీ గాయనిగా కూడా రాణించారు. కాగా ‘ఆబోషెషె’ చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు లభించింది.