హిట్టా లేక ఫట్టా : దువ్వాడ జగన్నాధమ్ ట్రెండీ టాక్

Friday, June 23rd, 2017, 04:38:46 PM IST

వరుస హిట్లతో జోరు మీదున్న స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. టీజర్,పాటలు, ట్రైలర్లతో, పలు రకాల వివాదాలతో భారీ స్థాయి హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఇక ఈరోజు ప్రదర్శింపబడిన మొదటి షో ద్వారా అందిన రిపోర్ట్ ప్రకారం హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యావరేజ్ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేగాక విమర్శకులు సైతమ్ సినిమా సగం వరకు సక్సెస్ సాధించిందని చెబుతూ చిత్రంలో హరీశ్ శంకర్ క్రియేట్ చేసిన దువ్వాడ జగన్నాథం పాత్ర, దాని ద్వారా ఎలివేట్ చేసిన ఫన్, ఆ పాత్ర పోషించిన బన్నీ పెర్ఫార్మెన్స్ సినిమాకు, పూజ హెగ్డే అందం సినిమాలో ఆకట్టుకునే అంశాలని చెబుతున్నారు.

అలాగే కొత్తదనమున్న కథ లేకపోవడం, దాని కారణంగా సెకండాఫ్ కథనం ఊహాజనితంగా, పేలవంగా సాగడం, అందులో ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేకపోవడం, బన్నీ డ్యాన్సులు కూడా సాదా సీదాగా ఉండటం నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయట. మరి ఈ సినిమాకు వివిధ వెబ్ సైట్లు ఇచ్చిన రివ్యూ రేటింగ్ వివరాలు, ప్రముఖ విమర్శకులు చేసిన ట్వీట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

Critic Reviews :

123telugu.com – అగ్రహారం యువకుడు అలరించాడు – 3.25/5

greatandhra.com – రొటీనః రొటీనస్య! – 2.5/5

gulte.com – సభ్య సమాజానికి రొటీన్ మెసేజ్ – 2.75/5

telugucinema.com – రెగులర్ కమర్షియల్ సినిమా – 2.75/5

tupaki.com – బోరో బోరస్య బోరభ్యహ – 2.25/5

indiaglitz.com – క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా.. డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఎంట‌ర్‌టైన్ చేస్తాడు – 2.75/5

Average Rating : 2.7 / 5

 

మీరు కూడా ‘డీజే’ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని ఈ కింది పోల్ ద్వారా తెలపండి.

 
 

Audience Talk from Twitter :