షాకింగ్ : మ్యాచ్ ఫిక్సింగ్ ట్వీట్ కు లైక్ కొట్టిన ధోని

Thursday, December 14th, 2017, 02:45:52 PM IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోని ఎన్ని గుర్తింపులను అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ధోని బెస్ట్ కెప్టెన్ అని ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు సైతం పేర్కొన్నారు. వరల్డ్ వైడ్ గా మంచి గౌరవాలను అందుకున్న ధోని వివాదాస్పద విషయాలకు చాలా దూరంగా ఉంటాడు. తనపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా చాలా కూల్ గా కౌంటర్ ఇస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో ధోని చాలా తక్కువగా కనిపిస్తుంటాడు.

2009 లో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన ధోని ఇంతవరకు కేవలం 3 లైకులను మాత్రమే కొట్టాడు అంటే నిజంగా షాకింగ్ అని చెప్పాలి. అయితే ఆ మూడవ లైక్ కూడా ధోని రీసెంట్ గా కొట్టాడు. అది కూడా ఒక వివాదస్పద ట్వీట్ కి ని లైక్ చేయడం సెన్సేషన్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇండియ‌న్ న్యూస్ వెబ్ సైట్ 2019 వరల్డ్ కప్ విరాట్ గెలవనుందని మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వారి అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ఇన్‌ఖ‌బ‌ర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి పలువురు క్రికెటర్లను అలాగే క్రికెట్ కి సంబందించిన ప్రముఖులను ట్యాగ్ చేసింది.

కోహ్లీ, ధోనీ, ర‌విశాస్త్రి, బీసీసీఐ, గంగూలీ, స‌చిన్ టెండూల్క‌ర్‌, క‌పిల్ దేవ్‌, అజారుద్దీన్‌, అనురాగ్ ఠాకూర్‌, రాజీవ్ శుక్లా, శ‌ర‌ద్ ప‌వార్‌, గౌత‌మ్ గంభీర్‌, అజ‌య్ జ‌డేజాల‌ను ఇన్‌ఖ‌బ‌ర్ ట్యాగ్ చేసింది. అయితే ఈ ట్వీట్ ను ధోని లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలాగే ధోని లైక్ కొట్టాడని ఆ వార్త పత్రిక అనేక కథలనలను పోస్ట్ చేయడం మరింత వివాదస్పదమైంది.