ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ ఎన్నికలు!

Saturday, February 7th, 2015, 07:07:52 PM IST

Delhi-Elections
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. కాగా సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్ లో 63.5% నమోదు అయినట్లు ఎన్నికల కమీషన్ పేర్కొంది. ఇక నియమిత కాలం దాటినప్పటికీ లైన్లలో ఓటరులకు ఓటు హక్కు వినియోగించుకునే ఆస్కారం ఉండడంతో పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎలక్షన్ కమీషన్ తెలిపింది. కాగా ఈసారి ఎన్నికలలో 70% వరకు పోలింగ్ నమోదు కావచ్చునని కమీషన్ ప్రాధమిక అంచనా వేస్తోంది. ఇక దీనితో పార్టీలన్నీ తమ గెలుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

కాగా ఢిల్లీ ఎన్నికలలో 70 నియోజక వర్గాలలో మొత్తం 673 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 63మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే పోలింగ్ శాతం పెరగడంతో ఆప్ పార్టీ విజయంపై ధీమాతో ఉంది. ఇక మరో పక్క అధికార భాజపా పార్టీ కూడా ఢిల్లీలో సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని ధృఢ విశ్వాశంతో ఉంది. మరి ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపి ఎవరిని అందలం ఎక్కించారో రానున్న ఫలితాల ద్వారా అతి త్వరలో తెలియనుంది.