దేశరాజధానిలో ప్రమాద స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

Monday, February 16th, 2015, 01:40:05 PM IST


దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాద స్థాయికి చేరుకున్నది. యమునా నది తీరంలో ఉన్న పరిసర ప్రాంతాలలో ఈ పొల్యూషన్ అధికంగా ఉంటుండటంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల కాలంలో కొన్ని సర్వేలు సర్వేను చేపట్టాయి.. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలో పొల్యూషన్ కలిగిన నగరాలలో ఢిల్లీ నాలుగో స్థానంలోఉన్నది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియాకు వచ్చేముందు కొన్ని సంస్థలు సర్వేను నిర్వహించాయి. దీనిప్రకారం గాలిలో దుమ్ము ధూళి కణాలు అత్యధికంగా ఉన్నాయని తేల్చింది. దుమ్ము ధూళి కణాలు గాలిలో పేరుకుపోవడం కారణంగా… శ్వాసకొస సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని ఆయా సంస్థలు తెలియజేస్తున్నాయి.

ఒక డయామీటర్ వ్యాసంలో కనుక 2.5 మైక్రోగ్రాముల దుమ్ము ధూళి కణాలు ఉంటే… అది చాలా ప్రమాదకరమైన అంశం అని… తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పర్యావరణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిటీలో పొల్యూషన్ నుంచి రక్షణ పొందేందుకు సర్జికల్ మాస్క్ లను ధరించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నదని..ఈ పొల్యూషన్ ఇలాగే పెరిగిపోతే కనుక సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా.. పొల్యూషన్ ను అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు.