ఏపీలో రుణమాఫీ నిధుల విడుదల!

Friday, December 12th, 2014, 08:40:01 PM IST

andhra-pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ నుండి 32 నోడల్ బ్యాంకులకు 4,586కోట్ల రూపాయల నిధులు రుణమాఫీకి విడుదలయ్యాయి. కాగా ఇంకా 11 నోడల్ బ్యాంకులు రుణమాఫీకి సంబంధించిన వివరాలు సమర్పించలేదు. అయితే ఈ బ్యాంకులు నుండి వివరాలు అందగానే మరో 78కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. ఇక మరోపక్క రుణమాఫీ పరిష్కారంపై ప్రభుత్వం జీవో 220 విడుదల చేసింది. అలాగే పిర్యాదుల పరిష్కారానికి మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేయనుంది. కాగా తొలి విడత అర్హులకు డిసెంబర్ 16లోగా రుణమాఫీ మొత్తాలు వారి ఖాతాల్లో జమకానున్నాయి.