కౌంటింగ్ మొదలైంది

Tuesday, September 16th, 2014, 09:38:34 AM IST

polling
తెలంగాణలోని మెదక్ లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ అసెంబ్లీనియోజకవర్గాలలో శనివారం జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8గంటలకు మొదలైంది. కాగా నందిగామ ఫలితాలు ఉదయం 11గంటలలోపు, మెదక్ ఫలితాలు మధ్యాహ్నం తరువాత వెలువడే అవకాశాలు ఉన్నాయి.

ఇక మెదక్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పటాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో కొనసాగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 121మంది పర్యవేక్షకులు, 120మంది సహాయకులతో పాటు 144మంది సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు. కాగా మెదక్ లో 22 రౌండ్లు, నందిగామలో 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక మెదక్ లోక్ సభ స్థానానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. దీనిలో తెరాస అభ్యర్ధి ముందంజలో ఉన్నట్లుగా సమాచారం.