జ‌గ‌న్నాట‌క సూత్ర‌ధారి.. ఇంకా అదే పాటా?

Sunday, September 25th, 2016, 02:40:09 AM IST


హోదాకు బ‌దులుగా ప్యాకేజీ ఇవ్వ‌డంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూల్ అయిపోయారు. ఆ విష‌యంలో వెంక‌య్య డైరెక్ట‌ర్ అయ‌తే చంద్ర‌బాబు హీరో అని అంద‌రికీ తెలుసు. అయినా ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి బాబుకు లోప‌ల ఎక్క‌డో అసంతృప్తి. ఎవో కొన్ని శ‌క్తులు ఆయ‌న్ను చేతులు క‌ట్టుకునేలా చేస్తున్నాయి. అయినా బాబు కేంద్రంపై మ‌రోసారి అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం. సుధాక‌ర్ బాబు, ప‌లువురు వైసీపీ నేత‌లు శుక్ర‌వారం రాత్రి టీడీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా బాబు కేంద్రాన్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ ప్ర‌జ‌లు తీర‌ని క‌ష్టాల్లో ఉన్నారు. రాష్ట్రం లో చాలా స‌మ‌స్య‌లున్నాయి. వాటిపై కేంద్రానికి మ‌రోసారి వివ‌రిస్తాను. కొత్త రాష్ట్రానికి అన్ని విధాల న్యాయం జ‌రిగే వ‌ర‌కూ కేంద్రాన్ని అన్నీ అడుగుతూనే ఉంటాను. ఈ విష‌యంలో నాకెలాంటి భ‌యం లేదు. నాకు హైకమాండ్ కేంద్రం కాదు. ప్ర‌జ‌లు మాత్ర‌మే. కేంద్రం నుంచి స‌హ‌యం అందాలంటే ఎలా ఒత్తిడి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఈ విష‌యాలేవీ తెలియ‌క ప్ర‌తి ప‌క్షాలు అన‌వ‌స‌రంగా ఆవేశప‌డిపోతున్నాయి. అవినీతి ర‌హిత రాష్ట్రంగా ఏపీని మార్చే వ‌ర‌కూ పోరాటం ఆగ‌ద‌ని బాబు స్ప‌ష్టం చేశారు. `నాకు హై క‌మాండ్ కేంద్రం కాదు, ప్ర‌జ‌లే!!` అంటూ అంద‌రి చెవిలో గుమ్మ‌డి పూలు పెట్టి య‌థావిధిగా బాబు జ‌గ‌న్నాట‌కం కంటిన్యూ చేస్తున్నార‌ని అర్థ‌మైంది క‌దూ?