తెలుగు ప్రభుత్వాల మధ్య వారధి ఎవరో?

Friday, July 24th, 2015, 04:36:56 PM IST


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏసీబీ ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. అలాగే ఈ కేసులో పెద్దవారిని వదిలేసి తెలంగాణ ఏసీబీ చిన్నవారిని విచారిస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఏసీబీ విచారణ నిష్పాక్షపాతంగా జరగడం లేదనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలాడుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎవరు వారధిగా ఉన్నారనే అనుమానాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.