కేజ్రివాల్ తో కాఫీ తాగాలంటే 20వేలు!

Friday, December 26th, 2014, 09:14:41 AM IST

kejriwal-1
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నిధులు పోగు చెయ్యడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ సరికొత్త ప్రణాలికలను రచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నిధుల కోసం ఇంతకు ముందు 20వేల రూపాయలకు కేజ్రివాల్ తో విందు చేసే అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అటుపై ‘సెల్ఫీ విత్ మఫ్లర్ మాన్’ కు శ్రీకారం చుట్టింది. అయితే దీనిలో 500రూపాయలకు కట్టి పేర్లు నమోదు చేసుకుంటే అటుపై లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారితో కేజ్రివాల్ ఫోటో దిగుతారు. కాగా ఆశించిన మేర ఈ ఐడియా పనిచెయ్యలేదేమో, అందుకే వెంటనే మరో కొత్త పధకంతో కేజ్రివాల్ ముందుకొచ్చారు. అదే ‘కాఫీ విత్ అరవింద్ కేజ్రివాల్’.

ఇక ‘కాఫీ విత్ అరవింద్ కేజ్రివాల్’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కేజ్రివాల్ తో కాఫీ తగినవారు 20వేల రూపాయలను చెల్లించి వెళ్ళాలట. కాగా కేజ్రివాల్ తో విందు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, ఫోటో విత్ మఫ్లర్ మాన్ ను అంతగా ఆదరించలేదు. మరి ఇప్పుడు కొత్తగా మొదలెడుతున్న కాఫీ విత్ అరవింద్ కేజ్రివాల్ ఎంత విజయం సాధిస్తుందో తెలియాలంటే తప్పక వేచి చూడాల్సిందే.