సీసీటీవీలు పట్టిస్తున్నాయ్

Monday, September 22nd, 2014, 09:12:44 PM IST


ఈ మధ్యకాలంలో విమానాశ్రయాలలో ప్రయాణికుల బ్యాగ్ లు మాయం అవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, పోయిన బ్యాగులను ఎయిర్ పోర్ట్ స్టాఫ్ దొంగాలిస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. కాని, అసలు విషయం ఏమిటంటే, ప్రయాణికుల బ్యాగ్ లను, సహచర ప్రయాణికులే అపహరిస్తున్నారని.. సిసిటీవీ పుటేజ్ ల ద్వారా బయటపడింది. ఒకందుకు ఈ సీసీటీవీలను విమానాశ్రయాలలో ఏర్పాటు చేస్తే.. అవి ఇందుకు ఉపయోగపడుతున్నాయని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక వివరాలోకి వెళ్తే..

సెప్టెంబర్ 30, 2013 వ సంవత్సరంలో రేడియో మిర్చి ఆర్ జె సిరి రవికుమార్ కోల్ కత నుంచి బెంగళూరు వచ్చింది. అయితే, ఎయిర్ పోర్ట్ లో తన బ్యాగ్ మిస్ అయినట్టు గమనించి.. ఫిర్యాదు చేసింది.. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది సహచర ప్రయాణికులే…ఆమె బ్యాగ్ దొంగలించినట్టు తేలడంతో.. ఆ దొంగను పట్టుకొని, బ్యాగ్ ను తిరిగి ప్రయాణికురాలికి అప్పగించారు.

ఇలాంటి సంఘటనలే.. ఎయిర్ పోర్ట్ లలో కొకల్లుగా జరుగుతున్నాయి. ప్రయాణికులు మాత్రం ఎయిర్ పోర్ట్ స్టాఫ్ లగేజ్ బ్యాగ్ లను దొంగాలిస్తున్నారని.. ఫిర్యాదులు చేస్తున్నారు.. ప్రతిసంవత్సరం 20కోట్ల రూపాయల విలువచేసే ఫిర్యాదులు అందుతున్నాయని.. వాటిలోనుంచి 10కోట్ల రూపాయల మేర.. తిరిగిస్వాదినం చేసుకుంటున్నామని సిఐఎస్ఎఫ్ డీజీ అరవింద్ రాజన్ తెలిపారు. ఎయిర్ పోర్ట్ లలో బాంబులు, తదితర మారణాయుదాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సీసీటీవీలు ప్రయాణికుల బ్యాగులను కనుగొనేందుకు ఉపయోగపడుతున్నాయని డీజీ అరవింద్ రాజన్ పేర్కొన్నారు.