ట్రెండీ టాక్‌: కేసీఆర్ `సిక్స్‌` సెన్స్

Tuesday, September 4th, 2018, 11:26:46 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ `సిక్స్` సెన్స్ గురించి.. సంఖ్యా శాస్త్రం సెంటిమెంటు గురించి మ‌రోసారి ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆయ‌న‌కు `6` అంకె బాగా క‌లిసొచ్చింది. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం నుంచి ప్ర‌తిదానికి 6 అంకెని న‌మ్మినంత‌గా దేనినీ న‌మ్మ‌లేదు ఆయ‌న‌. ఇక త‌న కాన్వాయ్‌లో సైతం ఆరు కార్లు మాత్ర‌మే ఉండేలా కీల‌క‌మైన మీటింగుల వేళ జాగ్ర‌త్త ప‌డుతుంటారు. అలానే ప‌ని చేసేచోట‌, ఆఫీస్‌లో, ఇంట్లో ప్ర‌తిచోటా సిక్స్ ప్ర‌భావం బాగా క‌నిపిస్తుందిట‌.

అంతెందుకు అత‌డి కార్ నంబ‌ర్ ప్లేట్‌లో 6 అంకెలే క‌నిపిస్తాయి. 3+ 3 ఆరు వ‌చ్చేలా సంఖ్యా శాస్త్రం ప్ర‌కారం ప్ర‌తిదీ ఆచ‌రిస్తుంటారు. కేబినెట్ మీటింగ్ స‌హా ప్ర‌తిచోటా 6 త‌ప్ప‌నిస‌రి. ఇక సంఖ్యా శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రాన్ని ఆయ‌న బాగా నమ్ముతారు. హుటాహుటిన కేబినెట్ మీటింగ్ అని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి.. ఈ సమావేశానికి ఆరు సంఖ్య‌ను అప్ల‌య్ చేస్తున్నార‌ట‌. చాలా సందర్భాల్లో కేసీఆర్ 6 మిస్ కాకుండా చూసుకుంటున్నారనేది సన్నిహితుల మాట‌. మ‌రోవైపు ఇప్ప‌టికిప్పుడు ఆక‌స్మికంగా మంత్రుల స‌మావేశం అంటూ కేసీఆర్ చేస్తున్న హ‌డావుడిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే పెండింగులో ఉన్న ప్రాజెక్టుల‌న్నిటినీ వెంట‌నే ప్రారంభించేయాల‌ని సార్ ఆజ్ఞాపించేయ‌డంతో మంత్రుల్లో ఒక‌టే ప‌రుగులు మొద‌ల‌య్యాయి. ఈ బుధ‌వారం అంద‌రూ హైద‌రాబాద్‌లోనే అందుబాటులో ఉండాల‌ని కేసీఆర్ హుకుం జారీ చేశారు.