చిరు ‘కత్తి’ కన్ఫామ్ అయినట్టేనా..!!

Monday, December 14th, 2015, 12:25:50 PM IST

చిరు 150 వ సినిమా గురించిన న్యూస్ గత కొంతకాలంగా మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 150 వ చిత్రం ఎలా ఉండబోతుంది. ఎలా తీస్తున్నారు. ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు. చిరు స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారా.. లేక.. దేనినైనా రీమేక్ చేస్తారా అనే కథనాలు పుంఖానుపుంకాలుగా వచ్చాయి. బాలివుడ్ పీకే సినిమా అని ఇంకా ఏవేవో సినిమాలు తెరపైకి వచ్చాయి. చివరకు తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నారు. చిరు సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని కూడా గతంలో ప్రకటించారు.

మరేమయిందో తెలియదు. ఆగష్టు లోనే ప్రారంభం అవుతుంది అనుకున్న చిరు సినిమా ఇప్పటి వరకు అతీగతి లేదు. అసలు చిరు 150 వ సినిమా చేస్తారా చేయరా అనే దానిపై కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే, ఎట్టకేలకు చిరంజీవి 150 వ చిత్రం కత్తి రీమేక్ అని కన్ఫామ్ చేశారు. కత్తి రీమేక్ లో నటించేందుకు చిరు అంగీకరించినట్టు చిరు తనయుడు, హీరో నిర్మాత రామ్ చరణ్ పేర్కొన్నారు. 2016లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనున్నది.