‘చిరు’కు అనుకోని ఎదురుదెబ్బ!

Saturday, May 16th, 2015, 11:00:15 PM IST


మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి శనివారం అనుకోని షాక్ తగిలింది. ఇక వివరాల్లోకి వెళితే కడప జిల్లా రైల్వే కోడూరులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహావిష్కరణకు వచ్చిన చిరంజీవి హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో చిరు ఆగమనం తెలుసుకున్న అభిమానులు పెద్ద గుంపుగా అతనిని కలిసేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు.

ఇక చిరును చూసేందుకు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డ జనంలోని ఒక వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక నగరం అభివృద్ధికి మీరేం చేశారని? మెగాస్టార్ ను నిలదీశాడు. దీనితో ఒక్కసారి షాక్ కు గురైన చిరు మౌనం వహించగా అతని గన్ మెన్లు సదరు వ్యక్తిని బలంగా వెనక్కి తోసేశారు. ఇక ఈ చర్యతో చిరు గన్ మెన్ లపై అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు.