పుట్టినరోజునాడు చంద్రబాబు నాయుడు చేసిన శపథం ఏమిటో తెలుసా..?

Wednesday, April 20th, 2016, 06:39:09 PM IST

chandrababu-naidu
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తముళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు, ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి పుట్టినరోజు గనుక. ఈరోజు ఆయన 66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్బంగా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సృజన కృష్ణ రంగారావు కూడా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పలువురు పాల్గోన్నారు.