నారా లోకేష్ వ్యాల్యూ పెరగడానికే బాబు ఆ నిర్ణయం తీసుకున్నారా..?

Friday, March 25th, 2016, 08:25:13 AM IST


చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ కొన్నేళ్ళ క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2015లో పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పెద్దగా పదవి చేపట్టిన సమయంలో ప్రతి ఒక్కరూ ఇక టీడీపీకి ఓ యువ నాయకుడు దొరికాడని.. రాజకీయంగా కొత్త ఎత్తుగడలు వేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తాడని అనుకున్నారు. వాళ్లనుకున్నట్టు యువ వారసుడు దొరికాడు కాని.. తాని రాజకీయ చతురత మాత్రం అంతగా పార్టీ వ్రుద్దిపై ప్రభావం చూపలేకపోయింది. అందుకు ఈ మధ్యనే జరిగిన గ్రేటర్ ఎన్నికలే నిదర్శనం.

దీంతో అతనిపై పార్టీలో కూడా కాస్త నిరాశ కనిపించింది. ఇక ఆలస్యం చేస్తే మొదటికే మోసమొస్తుందనుకున్న బాబు వెంటనే లోకేష్ కు ఏదో పదవి కట్టబెట్టి పార్టీలో ఆయన్ను పాతుకుపోయేలా చేయాలని నిర్ణయించి త్వరలో రాష్ట్ర క్యాబినెట్ లో జరగబోయే సర్దుబాట్లలో అతనికి కూడా ఓ పదవిని కట్టబెట్టాలని డిసైడయ్యారని సమాచారం. అంటే సొంత పార్టీలో సొంత కుమారుడి ఉనికి ప్రశ్నార్థకం కాకుండా బాబుగారు ఈ చర్య తీసుకున్నారన్నమాట.