ఆడియో టేప్ తో అడ్డంగా బుక్కైన చంద్రబాబు!

Monday, June 8th, 2015, 08:37:29 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఆడియో టేప్ బహిర్గతమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. ఇక ఆదివారం చంద్రబాబు గవర్నర్ నరసింహన్ ను కలిసి వచ్చిన కొద్దిసేపటికే ఆడియో టేప్ బహిర్గతం కావడంతో ఇరు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. కాగా రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న తరుణంలోనే బాబు మాటల వివరాలు లభించాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

అలాగే రేవంత్ రెడ్డి అరెస్ట్ కు ముందు, ఆ తర్వాత కాల్ డేటాను విశ్లేషించిన అధికారులు అందులో 50 నుండి 75 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ కాల్ డేటా ఉదంతం టీవీ ఛానెల్స్ లో ప్రసారం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంపై మంత్రులతో గతరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఆడియో టేప్ ల ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న తొలి సీఎం చంద్రబాబేనంటూ సంచలనం రేపుతున్న ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాల్సిందే.