ప్యాలెస్ పైన పెట్టిన దృష్టి ప్రజాసేవ మీద పెడితే బాగుండు… జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

Wednesday, February 27th, 2019, 03:19:28 PM IST

రాజకీయాల్లో సర్వసాధారణం అనే విధంగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం మాములే అయిపోయింది. అలాగే తాజాగా చంద్రబాబు, జగన్ మీద చాల సైలెంట్ గా విమర్శలు చేశారు… నేడు జగన్ తన నూతన ఇంటికి గృహప్ప్రవేశం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వైకాపా పేదల పార్టీ కాదని.. ప్యాలెస్‌ల పార్టీ అని అన్నారు. ప్యాలెస్ లో తప్ప మాములు స్థావరాల్లో జగన్ నివసించరని, ఎక్కడకు వెళ్లిన కూడా రాజుల్లాంటి కోటలోనే బస చేస్తారని ఎద్దేవా చేశారు. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్‌, పులివెందుల ప్యాలెస్‌లకు తోడు ఇప్పుడు అమరావతిలో ఇంకో ప్యాలెస్‌ ఏర్పడిందన్నారు.

జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే ఉందని.. ప్రజాసేవ పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రజల కోసం ఆలోచాల్సిందిపోయి ఎప్పుడు కూడా కేవలం తన నివాసం కోసం పాటుపడతాడని, ఇప్పటికే ఎన్నో ప్యాలెస్ లు నిర్మించుకున్నారని, విమర్శలు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటివరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదని, కేవలం తన విలాసాలకు సమయాన్ని వాడుతున్నదని, ప్రజలకోసం అసలే ఆలోచించడం లేదని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.