విశాఖ రైల్వే జోన్ : జ‌గ‌న్ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Thursday, February 28th, 2019, 11:11:21 AM IST

ఏపీ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది కేంద్రం. విశాఖపట్నం రైల్వే జోన్ ను మంజూరు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు.

దీంతో కేంద్రం ప్ర‌క‌టించిన విశాఖ‌ రైల్వే జోన్ పై వైసీపీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా, ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రైల్వే జోన్ ఇవ్వడాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నార‌ని.. రైల్వే జోన్ వచ్చిందిని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని బాబు అన్నారు.

అలాగే న‌రేంద్ర మోదీకి జ‌గ‌న్ వత్తాసు పలుకుతున్నార‌ని.. వైసీపీ కుట్రలను ప్రజల్లో ఎండగట్టాలని.. కేంద్రం చేసిన మోసాని వైసీపీ కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తుందని.. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశారు.

అయితే నిజానికి మొద‌టి నుండి ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యం అయినా.. విశాఖ రైల్వే జోన్ అంశం అయినా స‌జీవంగా ఉందంటే, అది కేవ‌లం వైసీపీ అండ్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాటమే కార‌ణం.

బీజేపీతో నాలుగేళ్ళపాటు కాపురం చేసిన టీడీపీ.. అప్పుడు రాష్ట్రానికి ఉప‌యోగ‌ప‌డే డిమాండ్ల‌ను ప‌క్క‌న‌ప‌డేశారు. ఎప్పుడైతే బీజేపీతో దోస్తీ క‌టీఫ్ చేశారో, అప్ప‌టి నుండి న‌యా డ్రామాలు మొద‌లు పెట్టారు.

దీంతో మొద‌టి నుండి విశాఖ రైల్వే జోన్‌ను సాధించ‌డానిక తీవ్రంగా కృషి చేసిన వైసీపీ ఇప్పుడు సంబ‌రాలు చేసుకుంటుంటే, చంద్ర‌బాబు కారాలు మిరియాలు నూరుతూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.