చిదంబరాన్ని ప్రశ్నించిన సిబిఐ

Tuesday, December 16th, 2014, 09:10:48 PM IST

chidambaram
దేశంలో వివాదాస్పదమైన ఎయిర్ సెల్ మాక్సిస్ ఒప్పందం కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ ఈరోజు ప్రశ్నించింది. 2006లో ఎఫ్ఐపీబీ 3500 కోట్ల విలువైన ఎయిర్ సెల్ మాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. అయితే.. ఆర్థికమంత్రికి కేవలం 600 కోట్లలోపు ఒప్పందాలనే ఆమోదించడానికి అధికారం ఉంటుంది… 3500 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని చిదంబరం ఆమోదించడంతో వివాదం నెలకొన్నది. చిదంబరం తనకు ఉన్న అధికార పరిధిని దాటి ఒప్పందాన్ని ఎలా ఆమోదిస్తారని సీబీఐ ప్రస్నిస్తున్నది. అధికమొత్తంలో ఉన్న ఒప్పందాలను ఆర్ధిక వ్యవహారాల కాబినెట్ కమిటీకి పంపాలి. ఆ కమిటీకి ప్రధాని నేతృత్వం వహిస్తారు. ఇలాంటివేవి చేయకుండా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నది. ఇక దీనిపై దర్యాప్తును సైతం ప్రారంభించింది.