మోడీ కోసం తారల ఆరాటం

Sunday, October 26th, 2014, 07:16:54 PM IST


ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ను ప్రారంభించేందుకు ముంబై వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ ముంబై రావడంతో.. ఆయనను కలిసేందుకు రాజకీయ నాయకులు క్యూ కట్టారు. అంతేకాదండోయ్.. బాలీవుడ్ తారలు తాము సైతం అంటూ.. మోడీని కలిసేందుకు తెగ ఉత్సాహం చూపారు.. అంతేకాదు.. మోడితో సెల్ఫీకోసం పోటీ పడ్డారు. అలా తీసుకున్న సెల్ఫీ ఫోటోలను సామాజిక వెబ్ సైట్ లలో అప్ లోడ్ చేసి ఆనందించారు. బాలివుడ్ నటి సొనమ్ కపూర్, శ్రద్దా కపూర్ లు, నటులు ఆదిత్యా రాయ్ సింగర్ సోను నిగమ్ లు మోడీతో సెల్ఫీ దిగిన వారిలో ఉన్నారు.
ఇది ఇలా ఉంటే శనివారం మోడీ ఢిల్లీ లోని బీజేపి కార్యాలయంలో విలేకరులకు దీపావళి విందు ఇచ్చారు. ఈ విందులో మోడీ బీజేపి ఫోటోగ్రాఫర్ అజయ్ కుమార్ సింగ్ నుంచి కెమెరాను లాక్కొని క్లిక్ అనిపించారు. అంతేకాకుండా.. మోడీ అజయ్ కుమార్ సింగ్ ఫోటో ను తీశారు. మోడీ తన ఫోటోను అద్బుతంగా తీశారని… ఇది తనకు లభించిన ఒక మంచి దీపావళి బహుమతి అని.. ఫోటోను ఫ్రేం కట్టి తన ఇంట్లో పెట్టు కుంటానని అజయ్ సింగ్ ఉత్సాహంగా తెలిపారు.