సముద్రంపై తేలుతున్న మృతదేహాలు

Tuesday, December 30th, 2014, 03:48:08 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ వెళ్ళాల్సిన ఎయిర్ ఏషియా విమానం గత ఆదివారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా అప్పటి నుండి మొదలు పెట్టిన గాలింపు చర్యల్లో తాజాగా ఎయిర్ ఏషియా విమానం తాలూకు తలుపులు, స్లయిడ్ ను బోర్నియా ద్వీపం సమీపంలో గుర్తించిన అధికారులు మరింత గాలింపుల అనంతరం సముద్రంపై తేలియాడుతున్న మృతదేహాలను గుర్తించారు.

ఇక ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిందని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన కొద్దిసేపటికే ఈ మృతదేహాల జాడ తెలిసింది. కాగా సముద్రంపై తేలియాడుతున్న ఈ మృతదేహాలు బాగా ఉబ్బినా, పాడవ్వలేదని వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక విమానం రాడార్ పరిధి నుండి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించగా, అటుపై ముమ్మరంగా గాలించిన మీదట మృతదేహాల ఆచూకీ కూడా లభ్యమైంది. కాగా విమానంలో 155మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉండడంతో మొత్తం 162మంది మరణించారా? లేదా ఎవరైనా బ్రతికారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.