బీజేపీ ఫిక్సైందంటే ఎవరిమాటా వినేట్టు లేదు..!

Thursday, December 24th, 2015, 10:13:44 AM IST


కొన్ని రోజులుగా అదికార బీజేపీలో కీర్తి ఆజాద్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాల చేతిలో అయితే ఆయుధంగానే మారింది. బీజేపీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ ఢిల్లీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ భారీ అవినీతికి పాల్పడ్డారని కొన్నేళ్ళుగా ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకూ పార్టీ లోపలే మగ్గిన ఈ విషయం గత రెండురోజులుగా భయటకు పొక్కడంతో బేజేపీ కీర్తి ఆజాద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షాలతో చేతులు కలిపి పార్టీ పరువును దిగజారుస్తున్నారని ఆరోపిస్తూ ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. సొంత పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు ఎంత చెప్పినా వినకుండా అమిత్ షా ఆయన్ను సస్పెండ్ చేశారు.

దీనిపై ఆజాద్ మాట్లాడుతూ ‘ నేనేమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఎన్నో ఏళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు వివరిస్తూనే ఉన్నాను. కానీ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. దీనివల్ల పార్టీకే నష్టం. తర్వాత ఏం జరగబోతోందో చూడండి. నేనేంటో చూపిస్తా’ అన్నారు.