దూసుకుపోతున్న బీజేపి

Sunday, October 19th, 2014, 09:47:33 AM IST


మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదలైంది. రెండు రాష్ట్రాలలో బీజేపి విజయం దిశగా దూసుకుపోతున్నది. ఈ మధ్యాహ్నానికి పూర్తీ ఫలితాలు వస్తాయని తెలుస్తున్నది. అయితే, మహారాష్ట్రలో ఎగ్జిట్ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మహారాష్ట్రలో బీజేపి పెద్ద పార్టీగా అవతరిస్తుంది కాని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. మరో పార్టీ సహకారం అవసరమని స్పష్టం చేశాయి. కాని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి బీజేపి మహారాష్ట్రలో దూసుకు పోతున్నది. తప్పకుండా ఆ రాష్ట్రంలో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.

ఇక హర్యానాలో కూడా బీజేపి హవా కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాలలో బీజేపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీకీ మహారాష్ట్రలో చుక్కెదురైంది. ఈ ఎన్నికలలో సత్తాచాటి సిఎం పదవి చేపట్టాలన్న శివసేన ఆశలకు మహారాష్ట్ర ప్రజలు గండిగోట్టారు. మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికలలో సైతం మోడీ హవా కొనసాగిందని చెప్పవచ్చు.