దిగోచ్చాడు..దారికోచ్చాడు

Friday, September 19th, 2014, 06:48:09 PM IST


2014 సార్వత్రిక ఎన్నికలలో విజయకేతనం ఎగరవేయడంతో ఊహాలోకంలో విహరించిన భారతీయ జనతాపార్టీ అధిష్టానం..నిన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగిపోయి నెలకు దిగివచ్చింది. మొన్నటివరకు మహారాష్ట్ర ఎన్నికల సీట్ల పంపకాల విషయంలో శివసేన పార్టీతో డీ అంటే డీ అన్న పార్టీనేతలు ఇప్పుడు దారికి వచ్చారు. బీజేపి ప్రతిపాదించిన సమాన ఫార్ములా.. విషయంలో శివసేన విభేదించింది. తమకు ఈసారి ఎక్కువ సీట్లు కేటాయించాలని పట్టుపట్టింది. లేకుంటే.. ఒంటరిగా పోటీచేసేందుకు కూడా వెనకాడబోమని శివసేన ప్రకటించింది.